మంత్రము:
ఓం తేజో అసి తేజో మయి ధేహి
అర్ధము:
హే పరమాత్మ! నీవు అనంత జ్ఞాన స్వరూపుడవు. దయచేసి నాయందును పూర్ణ జ్ఞానమును నింపుము.
మంత్రము:
ఓం వీర్యమసి వీర్యం మయి ధేహి
అర్ధము:
హే పరమాత్మ! నీవు అనంత పరాక్రమవంతుడవు. నా యందును పూర్ణ పరాక్రమమును నింపుము.
మంత్రము:
ఓం బలమసి బలం మయి ధేహి
అర్ధము:
హే పరమాత్మ! నీవు అనంత బలయుక్తుడవు, నాయందును పూర్ణ బలమును చేర్చుము.
మంత్రము:
ఓం ఓజో అసి ఓజో మయి ధేహి
అర్ధము:
హే పరమాత్మ! నీవు అనంత సామర్థ్యయుక్తుడవు, నాకును పూర్ణ సామర్థ్యమును ప్రసాదింపుము.
మంత్రము:
ఓం మన్యురసి మన్యుం మయి ధేహి
అర్ధము:
హే పరమాత్మ! నీవు దుష్టులను శిక్షింతువు. నన్ను దుష్ట కార్యములకు దూరముగా ఉంచి నీ కృపకు పాత్రుడను అగునట్లుగా చేయుము.
మంత్రము:
ఓం సహో అసి సహో మయి ధేహి
అర్ధము:
హే పరమాత్మ! మీరు అత్యంత సహనంతో ఈ సమస్త బ్రహ్మాండమును ఓర్పుతో మోయుచున్నారు. నేను కూడా అత్యంత సహనంతో స్థితప్రజ్ఞుడినై ఉండునట్లు ఆశీర్వదించండి.
Mantra:
Om Tejo-asi tejo mayi dhehi
Meaning:
Oh Paramatma, your wisdom knows no bounds. Please bless me with the gift of knowledge.
Mantra:
Om Balam asi balam mayi dhehi
Meaning:
Oh Paramatma, your might is immeasurable. Please bestow upon me the resilience and vigor to endure every challenge, both mentally and physically.
Mantra:
Om Ojo-asi ojo mayi dhehi
Meaning:
Oh Paramatma, your capabilities are boundless. Please endow me with the strength and wisdom to handle any situation that arises.
Mantra:
Om Manyur-asi manyum mahi dhehi
Meaning:
Oh Paramatma, you channel your righteous anger against injustice and wrongdoing. Please bless me with that same strength of character.
Mantra
Om Saho-asi saho mayi dhehi
Meaning:
Oh Paramatma, you remain consistent in your reactions regardless of whether the circumstances are favorable or challenging. Please bless me with the stability and maturity to handle everything gracefully.